వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలుగడ్డల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన టేక్రియాల్ బైపాస్ శివారులో 44వ జాతీయ రహదారిపై బుధవారం చోటుచేసుకుంది.
నాగపూర్ నుంచి హైదరాబాద్ వైపు ఆలుగడ్డలను తీసుకువెళ్తున్న క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో లారీ ఒక్కసారిగా రోడ్డు పక్కకు ఒరిగి పడిపోయింది. లారీలో ఉన్న ఆలుగడ్డల బస్తాలు చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
Comments
Loading comments...

