Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదుపులోనే సీజనల్‌ వ్యాధులు

Follow Udayam on Google
Madhu Sep 23, 2026 4:47 PM ములుగుGeneral
అదుపులోనే సీజనల్‌ వ్యాధులు - Udayam
మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా వంటి సీజనల్‌ వ్యాధులు అదుపులోనే ఉన్నాయని డీఎంహెచ్‌వో డాక్టర్‌ గోపాల్‌రావు తెలిపారు. వ్యాధుల నియంత్రణకు ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. కేసులు నమోదైన ప్రాంతాల్లో అవగాహన, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 14 ఏళ్లు నిండిన బాలికలకు హెచ్‌పీవీ టీకా వేయించాలని సూచించారు. 30 ఏళ్లు పైబడిన వారు ఏటా బీపీ, మధుమేహ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...