వార్తలకు తిరిగి వెళ్లండి

అద్దంకి మండలంలో 25 కిలోల బియ్యం బస్తా ధర నెల రోజుల్లో రూ.1,500 నుంచి రూ.2,400కు పెరిగింది. సాగర్ జలాలు విడుదల కాక వరిసాగు నిలిచిపోవడంతో బియ్యం ధరలు పెరిగాయని స్థానికులు చెబుతున్నారు.
తక్కువ ధరకు బియ్యం విక్రయించే కేంద్రాలు మూతపడటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని తెలిపారు. ధరలు నియంత్రించి, విక్రయ కేంద్రాలను పునఃప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Comments
Loading comments...

