Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైత్రి డ్రగ్స్‌ ల్యాబ్‌లో ప్రమాదం: కార్మికుడు మృతి

Follow Udayam on Google
Harika Jun 12, 2026 1:00 PM సంగారెడ్డిGeneral
మైత్రి డ్రగ్స్‌ ల్యాబ్‌లో ప్రమాదం: కార్మికుడు మృతి - Udayam
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మైత్రి డ్రగ్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ప్రవీణ్‌కుమార్ (25) అనే కార్మికుడు మృతి చెందాడు. మూడు రోజుల క్రితం ల్యాబ్‌లో విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రవీణ్ మరణించాడు. ప్రమాద విషయాన్ని బయటకు పొక్కకుండా యాజమాన్యం గోప్యంగా ఉంచిందని ఆరోపణలు వస్తున్నాయి. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...