వార్తలకు తిరిగి వెళ్లండి

ఆముదాలవలస పురపాలక సంఘ పరిధిలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తూ వాహనదారులు, స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.
రోడ్లపై అకస్మాత్తుగా వాహనాల వెంట పరుగులు తీయడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత పురపాలక అధికారులు స్పందించి కుక్కల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

