Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

300 లగ్జరీ హోటళ్లకు టోకరా

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jul 04, 2026 9:18 AM జాతీయంGeneral
300 లగ్జరీ హోటళ్లకు టోకరా - Udayam
తమిళనాడుకు చెందిన బింగ్‌సన్‌ జాన్‌ (69) అనే వృద్ధుడు దేశవ్యాప్తంగా టూర్‌ గైడ్, యోగా శిక్షకుడి అవతారాల్లో 300కు పైగా లగ్జరీ హోటళ్లను మోసం చేసి బిల్లులు కట్టకుండా పారిపోతూ ఛత్తీస్‌గఢ్‌ పోలీసులకు దొరికిపోయాడు. గత 36 ఏళ్లుగా పలు రాష్ట్రాల్లో కేసులు, తిహాడ్‌ సహా వివిధ జైళ్లలో 15 ఏళ్లకు పైగా శిక్ష అనుభవించినా ఇతని తీరు మారలేదు. ఇటీవల రాయ్‌పుర్‌లోని ‘హయత్‌’ ఫైవ్‌స్టార్‌ హోటలులో జూన్‌ 25న దిగి, 27న బిల్లు కట్టకుండా అదృశ్యమయ్యాడు. హోటల్ యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక నిఘా ఆధారంగా ఈ ఘరానా మోసగాడిని అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...