Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురైతే.. కుటుంబ సభ్యులకు రూ.8 లక్షల సహాయం

Udayam Digital Staff Apr 02, 2026 5:57 AM హైదరాబాద్ 1 viewsabout 1 month ago
ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురైతే.. కుటుంబ సభ్యులకు రూ.8 లక్షల సహాయం - Udayam Digital
విద్యుత్ ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుండి రూ.8 లక్షలకు పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) ఆదేశాలిచ్చింది. ఈ పెంపు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తుంది. వినియోగదారుల తప్పిదం ఉన్నా ఈ పరిహారం వర్తిస్తుందని, రెండు నెలల్లోపు దీనిని చెల్లించాలని డిస్కంలకు స్పష్టం చేసింది. మరోవైపు, 2026-27 ఆర్థిక సంవత్సరానికి పాత విద్యుత్ ఛార్జీలే కొనసాగుతాయని ఈఆర్‌సీ ప్రకటించింది. రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వినియోగదారుల నుండి వసూలు చేసిన అదనపు సొమ్మును, హైటెన్షన్ వినియోగదారుల పెనాల్టీలను రాబోయే బిల్లుల్లో సర్దుబాటు చేయాలని సూచించింది. లోటు బడ్జెట్‌ను పూడ్చేందుకు ప్రభుత్వం రూ.14 వేల కోట్లు కేటాయించింది.

Comments

G
Loading comments...