వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దళారుల బారి నుంచి రైతులను కాపాడేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. బేతంపూడిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. రైతులు తాము పండించిన పంటను ఈ కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మల్లీశ్వరితో పాటు కాంగ్రెస్ జిల్లా నాయకులు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ కేంద్రాలను నిర్వహిస్తోందని, వీటిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పంట సేకరణలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆయన ఆదేశించారు.
Comments
Loading comments...

