Back to feed
రాజకీయాలుBreaking
భాజపా, ఈసీ కలిసి కుట్ర పన్నాయి; ఓటర్ల తొలగింపుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు.
Udayam Digital Staff Apr 11, 2026 9:20 AM అల్ ఇండియా 11 views28 days ago

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భాజపాపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించేందుకు, తప్పుడు కేసులు పెట్టేందుకు ఈసీతో కలిసి కుట్ర పన్నారని, అయితే ఆ ప్రయత్నాలను తమ పార్టీ నేతలు సమర్థవంతంగా భగ్నం చేశారని ఆమె పేర్కొన్నారు.
ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు ఏకంగా 90 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచే ధైర్యం లేకనే భాజపా ఈవీఎంలలో అవకతవకలకు పాల్పడేందుకు ప్రణాళికలు రచిస్తోందని ఆమె తీవ్రంగా విమర్శించారు.
Comments
Loading comments...



