Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో పోర్టు కనెక్టివిటీ హైవేల అభివృద్ధి: ఆర్ అండ్ బీ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష.

Follow Udayam on Google
ఏపీలో పోర్టు కనెక్టివిటీ హైవేల అభివృద్ధి: ఆర్ అండ్ బీ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష. - Udayam
రాష్ట్రంలోని అన్ని పోర్టులను అనుసంధానిస్తూ పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చేలా జాతీయ రహదారుల నిర్మాణం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గుజరాత్ తరహాలో ఏపీని పోర్టు ఆధారిత ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రాబోయే రెండేళ్లలో 1,335 కిలోమీటర్ల ఎన్‌హెచ్ కారిడార్లను అందుబాటులోకి తీసుకురావాలని, ప్రధాన నగరాలకు ఔటర్ రింగ్ రోడ్లు నిర్మించాలని సీఎం స్పష్టం చేశారు. వచ్చే పుష్కరాల నాటికి 531 కిలోమీటర్ల రహదారి పనులను పూర్తి చేయాలని గడువు విధించారు.

Comments

G
Loading comments...