Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అమరావతి రాజధాని నిర్మాణంలో వేగం.

Follow Udayam on Google
అమరావతి రాజధాని నిర్మాణంలో వేగం. - Udayam
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వ హయాంలో సరికొత్త వేగాన్ని పుంజుకున్నాయి. పార్లమెంటు ఆమోదం, గెజిట్ విడుదల తో చట్టబద్ధత లభించడంతో పెట్టుబడిదారుల్లో భరోసా పెరిగింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి సంస్థల నుండి సుమారు రూ. 40,887 కోట్ల రుణాలు సమకూరడం రాజధాని అభివృద్ధికి ఊతమిస్తోంది. ప్రస్తుతం 20 వేల మంది కార్మికులతో సచివాలయం, హైకోర్టు, ఐకానిక్ భవనాల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. బిట్స్ పిలానీ, ఎస్‌ఆర్‌ఎం వంటి విద్యాసంస్థలతో పాటు పలు ఐటీ సంస్థలు తమ కార్యాలయాల ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ పూర్తి సహకారంతో అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...