Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 'యోగాంధ్ర-2026' వేడుకలు: జూన్ 7 నుంచి ప్రారంభం

Follow Udayam on Google
Vikram Sharma Jun 02, 2026 3:38 PM అమరావతిGeneral
ఏపీలో 'యోగాంధ్ర-2026' వేడుకలు: జూన్ 7 నుంచి ప్రారంభం - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 'యోగాంధ్ర-2026' పేరుతో ఘనంగా నిర్వహించనున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్ తెలిపారు. జూన్ 7 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగా ప్రచార కార్యక్రమాలు, పోటీలు జరుగుతాయని వెల్లడించారు. ఈ ప్రచారంలో కోటి మందిని భాగస్వాములను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జూన్ 21న అమరావతి కృష్ణా నది వంతెనపై జరిగే ముగింపు వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటారని, యోగా ప్రచారం కోసం ప్రత్యేకంగా 'ఏపీ యోగా ప్రచార పరిషత్' ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారని మంత్రి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...