Back to feed
విశాఖలో భారీ డేటా సెంటర్
Ravi Joshi Jun 03, 2026 12:33 PM విశాఖపట్నం 8 viewsabout 11 hours ago

విశాఖపట్నంలో 2 గిగావాట్ల సామర్థ్యంతో భారీ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు ‘ఎయిర్ ట్రంక్’ సంస్థ ఆసక్తి చూపినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో రాబిన్ ఖుదాతో జరిగిన సమావేశం ఫలప్రదమైందని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఏఐ, క్లౌడ్ సాంకేతికతలకు కేంద్రంగా మారుతున్న విశాఖలో డిజిటల్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంపై చర్చించామన్నారు. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తాయని, డిజిటల్ మౌలిక సదుపాయాలు బలోపేతమవుతాయని సీఎం పేర్కొన్నారు.
Comments
Loading comments...


