Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్‌లో కార్మికుడు అదృశ్యం!

Follow Udayam on Google
Ravi Singh May 28, 2026 12:20 PM నిజామాబాద్General
నిజామాబాద్‌లో కార్మికుడు అదృశ్యం! - Udayam
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని నాగారానికి చెందిన మున్సిపల్ కార్మికుడు జితేందర్ అదృశ్యమయ్యారు. మంగళవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన, బుధవారం సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఇలాగే వెళ్లి వచ్చేవారని కుటుంబీకులు తెలిపారు. కానీ, ఈసారి ఎంతకీ రాకపోవడంతో ఐదో టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...