Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జలమండలి జీఎం అనంత లక్ష్మీకుమార్‌కు రిమాండ్‌

Follow Udayam on Google
Ritika Singh May 20, 2026 3:04 PM హైదరాబాద్General
జలమండలి జీఎం అనంత లక్ష్మీకుమార్‌కు రిమాండ్‌ - Udayam
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన జలమండలి జీఎం అనంత లక్ష్మీకుమార్‌ను ఏసీబీ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను అధికారులు వెంటనే చంచల్‌గూడ జైలుకు తరలించారు. నిర్వహించిన సోదాల్లో రిజిస్ట్రేషన్ ప్రకారం రూ.5.88 కోట్ల ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే, బహిరంగ మార్కెట్‌లో ఈ ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేసి, విచారణను వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...