వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ రేపు కేరళలో ఒకరోజు పర్యటించనున్నారు. కొట్టాయంలో జరిగే 'దీపిక' మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం కన్నూర్‌లో రాజ్యసభ ఎంపీ సి. సదానందన్ మాస్టర్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు.
ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఉన్నతాధికారులు భద్రతా చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
Comments
Loading comments...

