వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాల కారణంగా విశాఖ 77వ వార్డు క్రాంతినగర్‌లో రెండు ఇళ్ల కింద కొండ మట్టి జారడంతో కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. వరుసగా ఉన్న 17 ఇళ్లలో ఈ ఘటన చోటుచేసుకుంది.
విషయం తెలుసుకున్న వార్డు అధ్యక్షుడు మజ్జి మాలినాయుడు బాధిత కుటుంబాలను పరామర్శించి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
Comments
Loading comments...

