Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ స్తంభాలకు ప్రకటనల బోర్డులు కడితే చర్యలు

Follow Udayam on Google
Kiran Oct 28, 2026 10:13 AM పెద్దపల్లి General
విద్యుత్ స్తంభాలకు ప్రకటనల బోర్డులు కడితే చర్యలు - Udayam
రామగుండం కార్పొరేషన్ పరిధిలో విద్యుత్ స్తంభాలకు అనుమతి లేకుండా ప్రకటనల బోర్డులు కడితే చర్యలు తీసుకుంటామని మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. ఇటీవల ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేసిన ఓ ఏజెన్సీ నిర్వాహకుడికి రూ.50 వేల జరిమానా విధించినట్లు తెలిపారు. మరికొందరికి నోటీసులు జారీ చేశామన్నారు. ఇలాంటి బోర్డుల వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...