వార్తలకు తిరిగి వెళ్లండి

వనమాల కనపర్తి గ్రామ ప్రాథమిక పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు గండి శరబంధం రూ.25,000 విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎల్లస్వామి మాట్లాడుతూ విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యమని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి చదవాలని సూచించారు. కార్యక్రమంలో హెడ్మాస్టర్ శ్రీనివాసాచారి, ఉపసర్పంచ్ కుమార్, వార్డు సభ్యుడు వినయ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

