వార్తలకు తిరిగి వెళ్లండి

సంస్థానారాయణపురం మండలం వావిళ్లపల్లిలో వారం రోజుల వ్యవధిలోనే నాటుకోళ్లకు విష ప్రయోగం చేసిన రెండు ఘటనలు చోటుచేసుకున్నాయి. వ్యవసాయ బావుల వద్ద పెంచుకుంటున్న జక్కర్తి రఘుకు చెందిన 15, కొంక చంద్రయ్యకు చెందిన 20 కోళ్లు మృతి చెందాయి.
గుర్తుతెలియని వ్యక్తులు బియ్యంలో విషం కలిపి చల్లడంతో కోళ్లు తిని చనిపోయాయని బాధిత రైతులు ఆరోపించారు. కావాలనే ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

