వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో సంభవించిన పిడుగులు, ధూళి తుఫానుల వల్ల 60 మంది మరణించారు. ప్రయాగ్‌రాజ్, భదోహీ జిల్లాల్లో అత్యధిక ప్రాణనష్టం సంభవించింది. వందకు పైగా గాయపడగా, పంటలకు భారీ నష్టం వాటిల్లింది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులతో సమీక్ష నిర్వహించి, బాధిత కుటుంబాలకు 24 గంటల్లోగా పరిహారం అందించాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

