వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాయిగూడలో పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు నైతం ప్రభాకర్‌రావుకు గ్రామస్థులు ఘనంగా వీడ్కోలు పలికారు. బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో పనిచేసిన ఆయన అక్టోబర్ 31న ఉద్యోగ విరమణ పొందారు.
ఆదివారం గ్రామస్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులు కలిసి ఆయనను ఎడ్లబండిపై ఆదివాసీ సంప్రదాయ డోలు వాయిద్యాలతో ఊరేగించారు. అనంతరం పాఠశాలలో ఆత్మీయ సన్మానం నిర్వహించి సత్కరించారు.
Comments
Loading comments...

