Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉంగుటూరులో నేలకొరిగిన వరి పంట

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 11:16 AM ఏలూరుGeneral
ఉంగుటూరులో నేలకొరిగిన వరి పంట - Udayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు ఉంగుటూరు మండలంలో వరి పొలాలు నేలకొరిగాయి. ఈనిక దశ, గింజ గట్టిపడే దశలో పంట ఒరగడంతో ఎకరానికి రూ.15-20 వేల వరకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్వర్ణ రకం వరి పంట ఎక్కువగా దెబ్బతిన్నట్లు రైతులు తెలిపారు. తుఫాన్ ప్రభావంతో పంట నష్టంపై రైతుల్లో ఆందోళన నెలకొంది.

Comments

G
Loading comments...