వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగతుర్తి మండలంలో తుఫాను ప్రభావంతో జల్లులు, తేలికపాటి వర్షం కురుస్తోంది. చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలి నుంచి ఉపశమనం కోసం రైతులు చలి మంటలు వేసుకుంటున్నారు.
వర్షం కారణంగా రోజువారీ పనులకు వెళ్లే కూలీలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపినట్లు సమాచారం.
Comments
Loading comments...

