వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం మండలం మిట్టమీదిపల్లిలో పొలం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ విద్యుత్ తీగ తగిలి యువ రైతు మందటి వెంకటరావు(28) బుధవారం మృతి చెందారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న ఆయనకు భార్య, కూతురు ఉన్నారు.
ప్రమాదంతో కుటుంబం శోకసంద్రంలో మునిగింది. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విశ్వనాథరెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

