వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులో టైర్లు వేడెక్కి లారీలో మంటలు చెలరేగాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి చేపల లోడుతో దిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు లారీ మొత్తానికి వ్యాపించాయి.
లారీలోని ఇద్దరు వెంటనే దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రాజీవ్ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోగా ఎస్సై చంద్రకుమార్ రాకపోకలను క్రమబద్ధీకరించారు.
Comments
Loading comments...

