Back to feed
టయోటా తొలి ఈవీ ‘ఎబెల్లా’ లాంచ్
Rohit Sardana May 29, 2026 9:43 AM అల్ ఇండియా 16 views1 day ago

టయోటా కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ కారు ‘అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా’ను భారత్‌లో లాంచ్ చేసింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.23.60 లక్షలు. ఈ మిడ్-సైజ్ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. పెద్ద బ్యాటరీ వేరియంట్ సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 543 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
ఈ కారులో 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 అడాస్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, 360 డిగ్రీల కెమెరాను అందించారు. ఇది క్రెటా ఈవీ, మారుతీ ఇ-విటారాలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
Comments
Loading comments...



