Back to feed
జూన్ నుండి పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు
Rohit Chatterjee May 29, 2026 10:10 AM అల్ ఇండియా 16 views1 day ago

వాహన తయారీ ఖర్చులు పెరగడంతో హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ కార్ల ధరలను జూన్ 1 నుండి పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడిసరుకుల ధరలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. 2026 క్యాలెండర్ ఇయర్‌లో హ్యుందాయ్ రేట్లను పెంచడం ఇది రెండోసారి.
ఈ తాజా నిర్ణయంతో కార్ల మోడల్స్, వేరియంట్లను బట్టి గరిష్టంగా రూ.12,800 వరకు భారం పడనుంది. ఎంట్రీ లెవెల్ కార్ల కంటే టాప్-ఎండ్ మోడల్స్ కొనేవారిపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండవచ్చని ఆటో నిపుణులు పేర్కొన్నారు.
Comments
Loading comments...



