Back to feed
తిరువణ్ణామలై భక్తులకు గుడ్ న్యూస్: ప్రత్యేక రైళ్లు సిద్ధం
Rohit Soni Jun 03, 2026 9:09 AM హైదరాబాద్ 10 viewsabout 15 hours ago

చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. రైలు నెం.07001 జూన్ 4 నుండి సెప్టెంబరు 24 వరకు ప్రతి గురువారం సాయంత్రం 5:50 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1:30 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో రైలు నెం.07002 జూన్ 5 నుండి సెప్టెంబరు 26 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 11:10 గంటలకు తిరువణ్ణామలైలో బయల్దేరి, మరుసటి రోజు సాయంత్రం 4:30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ సేవలు భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా మారనున్నాయి.
Comments
Loading comments...



