వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లా డిండి మండలం ఎర్రగుంటపల్లి వద్ద కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై మూడు డీసీఎంలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గొర్రెల లోడుతో వెళ్తున్న వాహనంపై కూర్చున్న నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన గొర్రెల వ్యాపారి ఎల్లయ్య అక్కడికక్కడే మరణించాడు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

