వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో కారు టైరు పేలి కల్వర్టును ఢీకొనడంతో ఓ మహిళ, వృద్ధుడికి గాయాలయ్యాయి. మాల్వాడి గుండం దాటిన తర్వాత ఈ ప్రమాదం జరిగింది.
శ్రీవారి దర్శనం ముగించుకుని తిరుపతికి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. విజిలెన్స్ సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. వారు నెల్లూరు జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.
Comments
Loading comments...

