Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండలో లారీ ఢీకొని ఇద్దరు మృతి

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 7:07 PM నల్గొండGeneral
నల్గొండలో లారీ ఢీకొని ఇద్దరు మృతి - Udayam
నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో లారీ బైకును వెనుక నుంచి ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. అయిటిపాముల శివారులోని అన్నారం ఎక్స్‌ రోడ్డు వద్ద NH-65పై సోమవారం ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న లారీ బైకును ఢీకొట్టడంతో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి, మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Comments

G
Loading comments...