వార్తలకు తిరిగి వెళ్లండి

విజయదశమి సందర్భంగా మల్దకల్ మండల కేంద్రంలోని ఆదిశిలాక్షేత్రంలో కొలువైన తిమ్మప్ప స్వామి దర్శనానికి మంగళవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నడిగడ్డ ప్రాంత ప్రజలు తిమ్మప్ప స్వామిని ఇంటి దైవంగా కొలుస్తారు. విశేష పర్వదినాల్లో స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
Comments
Loading comments...

