వార్తలకు తిరిగి వెళ్లండి

తూప్రాన్ పట్టణంలో గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం తెల్లవారుజామున రెండు ఎరువుల దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. సాయిరాం ఎరువుల దుకాణంలో సుమారు రూ. 51 వేల నగదును దుండగులు అపహరించారు. పక్కనే ఉన్న మరో దుకాణంలో కూడా చోరీకి విఫలయత్నం చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

