వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా టీజీపీఎస్సీ 3 కొత్త నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో ఆర్ అండ్ బీ శాఖలో 222 ఏఈఈ, 49 సివిల్ పోస్టులున్నాయని, త్వరలోనే మరో 3,800 ఉద్యోగాల భర్తీకి అనుమతులు లభించాయని కమిషన్ అధ్యక్షుడు బుర్రా వెంకటేశం తెలిపారు.
ఇకపై పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలోనే జరుగుతాయని, పరీక్ష ముగిసిన వెంటనే మార్కులు స్క్రీన్‌పై కనిపిస్తాయన్నారు. లీకేజీలకు తావులేకుండా పరీక్ష రోజే ప్రశ్నాపత్రం తయారుచేసేలా పారదర్శక విధానాన్ని తెస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

