వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్‌లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన తొమ్మిది మంది ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్లు అధికారులు శనివారం వెల్లడించారు.
ఢిల్లీ, ముంబై, పంజాబ్‌లలో కీలక భవనాలు, భద్రతా సిబ్బందే లక్ష్యంగా వీరు దాడులకు ప్రణాళిక రచించారు. నిందితుల నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఐఎస్ఐ వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

