Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

తెలంగాణ హైవేల విస్తరణకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

Sagarika Ghose Jun 03, 2026 11:06 AM హైదరాబాద్ 14 viewsabout 13 hours ago
తెలంగాణ హైవేల విస్తరణకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ - Udayam Digital
కేంద్ర క్యాబినెట్ తెలంగాణ, ఒడిశా, బిహార్‌లలో జాతీయ రహదారుల విస్తరణకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల (ఎన్‌హెచ్ 63), జగిత్యాల-కరీంనగర్ (ఎన్‌హెచ్ 563) హైవేలను నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. రూ.7,597 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 190 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు పనులు జరగనున్నాయి. హైబ్రిడ్ యాన్యుటీ, బీవోటీ పద్ధతుల్లో ఈ ప్రాజెక్టులను చేపట్టేందుకు కేంద్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Comments

G
Loading comments...