Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Follow Udayam on Google
Sanjay Singh May 30, 2026 11:21 AM జాతీయంGeneral
నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు ఆగ్రహం - Udayam
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉన్నత స్థాయి కమిటీ ఉన్నప్పటికీ పేపర్ ఎలా లీకైందని కేంద్రాన్ని ప్రశ్నించింది. ఈ వైఫల్యం ఎంతో కష్టపడి చదివిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర నిరాశకు గురిచేసిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మరోవైపు, లీకేజీల నివారణకు 2027 నుంచి నీట్ పరీక్షను కంప్యూటర్ ఆధారిత టెస్ట్ (CBT) విధానంలో నిర్వహిస్తామని ఎన్‌టీఏ కోర్టుకు తెలిపింది. దీంతో ప్రస్తుతం ఉన్న పేపర్, పెన్ను విధానానికి స్వస్తి పలకాలని ఉన్నత స్థాయి కమిటీ సూచించినట్లు పేర్కొంది.

Comments

G
Loading comments...