వార్తలకు తిరిగి వెళ్లండి

ఎబోలా లక్షణాలతో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఓ సుడాన్ ప్రయాణికుడిని అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. థర్మల్ స్క్రీనింగ్‌లో అతనికి తీవ్ర జ్వరం ఉన్నట్లు గుర్తించడంతో, వెంటనే ప్రత్యేక అంబులెన్స్‌లో ఐసోలేషన్ వార్డుకు చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ప్రస్తుతానికి ఎబోలా నిర్ధారణ కానప్పటికీ, అతని ట్రావెల్ హిస్టరీ ఆధారంగా వైద్యులు శాంపిళ్లను సేకరించి పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ఆఫ్రికాలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్యశాఖ ఎయిర్‌పోర్ట్ వద్ద నిఘా పెంచింది.
Comments
Loading comments...

