Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్టాండర్డ్‌ ఇంజినీరింగ్‌ దూకుడు.. ఆదాయంలో 62% వృద్ధి!

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 10:03 AM జాతీయంవాణిజ్యం
స్టాండర్డ్‌ ఇంజినీరింగ్‌ దూకుడు.. ఆదాయంలో 62% వృద్ధి! - Udayam
స్టాండర్డ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ (ఎస్‌ఈటీఎల్‌) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆకర్షణీయమైన ఫలితాలు నమోదు చేసింది.కంపెనీ ఆదాయం గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 62.3 శాతం పెరిగి రూ.296.6 కోట్లకు చేరింది.నికర లాభం 37.9 శాతం వృద్ధితో రూ.28.2 కోట్లుగా నమోదైంది. ఫార్మా సీడీఎంఓ విభాగంలో అవకాశాలు,అమెరికాకు పెరుగుతున్న ఎగుమతులు మెరుగైన ఫలితాలకుదోహదపడ్డాయని సంస్థ ఎండీ నాగేశ్వరరావు కందుల తెలిపారు.

Comments

G
Loading comments...