వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నైవేద్యాల తరలింపులో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆలయ హెడ్రాలిక్ లిఫ్టు ఏడాదిగా మరమ్మతుకు గురికావడంతో, అర్చకులు భోగాలను మెట్ల మార్గం ద్వారా మోసుకుంటూ వెళ్లాల్సి వస్తోంది.
భక్తులు నడిచే దారిలోనే ప్రసాదాలను తీసుకెళ్లడం అపచారమని అర్చకులు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండుటెండలో బరువులు మోస్తూ మెట్లు దిగడం సిబ్బందికి భారంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి లిఫ్టుకు మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

