Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Follow Udayam on Google
Aditi Rao Jun 01, 2026 4:22 PM జాతీయంమార్కెట్లు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు - Udayam
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగో రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఆరంభ లాభాలన్నీ ఆవిరయ్యాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి, ఎఫ్‌ఐఐల అమ్మకాలు మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. చివరకు సెన్సెక్స్ 508 పాయింట్లు నష్టపోయి 74,267 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 165 పాయింట్లు కోల్పోయి 23,382 వద్ద ముగిసింది. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

Comments

G
Loading comments...