Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరుసగా నాలుగో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్

Follow Udayam on Google
Ravi Jun 18, 2026 4:03 PM జాతీయంమార్కెట్లు
వరుసగా నాలుగో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్ - Udayam
పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గడం, ముడి చమురు ధరలు పడిపోవడంతో దేశీయ సూచీలు పుంజుకున్నాయి. ఉదయం నష్టాలతో మొదలైనప్పటికీ, చివర్లో కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 254 పాయింట్లు పెరిగి 77,409 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 82 పాయింట్ల లాభంతో 24,168 వద్ద స్థిరపడింది. రూపాయి విలువ బలపడడం, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ సూచీలు సానుకూలంగా స్పందించడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది.

Comments

G
Loading comments...