వార్తలకు తిరిగి వెళ్లండి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. ఫలితంగా సెన్సెక్స్ 116 పాయింట్లు నష్టపోయి 74,243 వద్ద, నిఫ్టీ 49 పాయింట్ల తగ్గుదలతో 23,366 వద్ద స్థిరపడ్డాయి.
వృద్ధి రేటు అంచనాల తగ్గింపు, ద్రవ్యోల్బణం పెంపు వంటి అంశాలు మార్కెట్‌పై ప్రభావం చూపాయి. ప్రధానంగా ఐటీ, మెటల్ రంగాలు బలహీనపడగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హెచ్‌యూఎల్ షేర్లు లాభపడ్డాయి. రూపాయి మారకం విలువ 94.94 వద్ద కొనసాగుతోంది.
Comments
Loading comments...

