Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జొన్నల కొనుగోలు వేగవంతం చేయండి: రైతుల మొర

Follow Udayam on Google
Anjali Puri May 28, 2026 11:32 AM ఆదిలాబాద్General
జొన్నల కొనుగోలు వేగవంతం చేయండి: రైతుల మొర - Udayam
ఆదిలాబాద్ జిల్లా మేడిగూడలో అకాల వర్షాల భయంతో మార్కెట్ యార్డులో ఇబ్బందులు పడుతున్నామని, తమ జొన్నలను త్వరగా కొనుగోలు చేయాలని రైతులు కలెక్టర్‌ను కోరారు. బుధవారం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌కు రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. రైతుల విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కొనుగోళ్లను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నగదు చెల్లింపులు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...