వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడం ఉత్తరాంధ్ర ప్రజల చారిత్రాత్మక విజయమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల నిరీక్షణ ఎట్టకేలకు నిజమైందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మాట్లాడిన ఆయన.. ఈ కొత్త రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ఇది రైల్వే పరిపాలనను బలోపేతం చేయడమే కాకుండా, కనెక్టివిటీని మెరుగుపరిచి ఆర్థిక వృద్ధిని పెంచుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

