Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి

Follow Udayam on Google
Kumar Sep 22, 2026 9:31 PM గుంటూరుక్రీడలు
స్కూల్ బస్సు ఢీకొని చిన్నారి మృతి - Udayam
ముప్పాళ్ళ (M) లంకలకూరపాడులో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి రెండున్నరేళ్ల కోడవాటి నితిన్ చనిపోయాడు. వివరాలు ఇలా.. పెద్ద కొడుకు సిద్ధార్థను స్కూల్ బస్సు ఎక్కించేందుకు నితిన్ను కూడా తీసుకుని తల్లి రాజకుమారి వచ్చింది. ఈ క్రమంలో నితిన్ బస్సు ముందుకు వెళ్లగా డ్రైవర్ గమనించకుండా పోనివ్వడంతో నితిన్ టైర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Comments

G
Loading comments...