Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెహ్వాగ్‌ తనయుడి మెరుపులు.. భారత్‌ ఘనవిజయం

Follow Udayam on Google
Sai Nath Nov 06, 2026 5:27 PM జాతీయంక్రీడలు
సెహ్వాగ్‌ తనయుడి మెరుపులు.. భారత్‌ ఘనవిజయం - Udayam
అండర్‌-19 ఆసియా కప్‌లో భారత యువ జట్టు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో నేపాల్‌పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత నేపాల్‌ను 42.3 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఇషాన్‌ సూద్‌ మూడు వికెట్లతో రాణించాడు. అనంతరం భారత్‌ 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. వీరేంద్ర సెహ్వాగ్‌ తనయుడు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ 70 (నాటౌట్‌),లక్ష్య రాజేశ్‌ రాయ్‌చందాని 53 (నాటౌట్‌) పరుగులతో అర్ధశతకాలు సాధించారు.

Comments

G
Loading comments...