వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్ మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. సుమారు 25 ఏళ్ల క్రితం నిర్మించిన భవనంలో శ్లాబు పెచ్చులూడుతున్నాయి. ఈ పాఠశాలలో 105 మంది విద్యార్థులు చదువుతున్నారు.
వర్షపు నీరు లోపలికి రాకుండా పైకప్పుపై ప్లాస్టిక్ కవర్లు వేశారు. పాత భవనంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, కొత్త భవనం మంజూరు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Loading comments...

