Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ చూసేందుకు పాఠశాలలకు సెలవు

Follow Udayam on Google
మానస శర్మ Jul 19, 2026 2:30 PM జాతీయంక్రీడలు
ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్ చూసేందుకు పాఠశాలలకు సెలవు - Udayam
ఫీఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుట్‌బాల్ అభిమానులైన విద్యార్థుల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని, సాధారణ విద్యాశాఖ పరిధిలోని పాఠశాలలకు రేపు (సోమవారం, జూలై 20) సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేరళ విద్యాశాఖ మంత్రి కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. నేటి రాత్రి జరగనున్న ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వీలుగా విద్యార్థుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

Comments

G
Loading comments...